Wednesday, 4 November 2026

అటవీ శాఖలో ఉద్యోగావకాశాలు

గుంటూరు, అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీలను పర్యవేక్షించడానికి బీఎస్సీ అగ్రికల్చర్‌, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సామాజిక అటవీశాఖ డీఎఫ్‌వో జి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికులు, నర్సరీల పెంపకంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేలు జీతం, రూ.2 వేలు టీఏ చెల్లిస్తామని తెలిపారు. అభ్యర్థులు కలెక్టరేట్‌లోని సామాజిక అటవీశాఖ కార్యాలయంలో గానీ లేదా 9440810127కు సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *