పరిగి, మార్చి 24 ( జనం సాక్షి )
హైవే రోడ్డుపై ఎదురెదరుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కుల్కచర్ల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి , మేకల శ్రీనివాస్ తో కలిసి పరిగి మండలం రూప్ ఖాన్ పేట్ గ్రామానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కోడంగల్ వైపు నుంచి రవికాంత్ రెడ్డి, షపీ అనే ఇద్దరు మోటారు సైకిల్ వస్తూ రూప్ ఖాన్ పేట్ శివారులో హైవే రోడ్డపై రెండు మోటారు సైకిళ్లు వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మేకల శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాల్యాయి. వీరిని వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు.
రెండు బైకులు ఢీ ఓ వ్యక్తి మృతి మరో ముగ్గురికి గాయాలు




