Wednesday, 4 November 2026

రెండేళ్లలో పది పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ఒక్కరు, ఇద్దరు కాదు.. కేవలం రెండేళ్లలో 10 మంది యువకులను పెళ్లి చేసుకుందో ఇరవై ఏళ్ల ఇరాన్ యువతి. పలువురిని పెళ్లి చేసుకోవడం.. పలు సాకులు చెప్పి విడాకులు తీసుకోవడం పరిపాటిగా పెట్టుకుంది. అయితే తమను మోసం చేసిందంటూ ఆమెను పెళ్లి చేసుకున్న కొందరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ లో 1979 నుంచి షరియా చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం వరుడు వధువు కన్యాశుల్కం ఇవ్వాలి. వివాహానంతరం వధువు ఎప్పుడు కోరితే అప్పుడు వరుడు దీనిని చెల్లించాలి. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువతి పెళ్లిళ్లు చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *