Thursday, 5 November 2026

రెండోరోజూ రాహుల్‌ పర్యటపై అనుమానాలు

సోమ్‌నాథ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుదింపు?

హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): రెండురోజుల పర్యటనకు హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షడు రాహుల్‌ గాంధీ మంగళవారం పర్యటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ఛటర్జీ అంత్యక్రియల్లో ఆయన పాల్లొంటారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా రెండోరోజు పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏఐసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలో రెండు రోజుల పర్యటన కోసం సోమవారం హైదరాబాద్‌ వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన షెడ్యూలును ఖరారు చేసిన టీపీసీసీ.. ఆయా కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేసింది.రాహుల్‌ పర్యటన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు రాహుల్‌ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, శక్తి యాప్‌, బూత్‌ కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు టీపీసీసీ రూపొందించిన చార్మ్స్‌ వ్యవస్థ ద్వారా సుమారు 31 వేలమంది బూత్‌ కమిటీల అధ్యక్షులతో రాహుల్‌ నేరుగా మాట్లాడతారు. 11.30 గంటలకు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగే పత్రికా సంపాదకులతో ముఖాముఖికి రాహుల్‌ హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ¬టల్‌ తాజ్‌కృష్ణా చేరుకుని యువ పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. తిరిగి హరితాఎ/-లాజా చేరుకుని మధ్యాహ్నం 2.15 నుంచి 3.15 గంటల వరకు తనను కలిసేందుకు వచ్చే ప్రముఖులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 3.45 గంటలకు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. 4.45 గంటలకు సరూర్‌నగర్‌లో విద్యార్థి నిరుద్యోగ గర్జన సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్‌ చేరుకుని.. రాత్రి 7.30 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.