హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): నగరంలో రెండురోజులపాటు జాతీయ పోషకాహార సంస్థ సదస్సునిర్వహిస్తున్నది. 2018 నవంబర్ నెలలో వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అలైనింగ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్తీ డైట్స్ అండ్ ఇంప్రూవుడ్ న్యూట్రీషన్ పేరుతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులు, విద్యార్థులు హాజరవుతున్నారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు వంటి వాటిపై నివేదిక విడుదల చేసే అవకాశమున్నది. గతంతో పోల్చుతూ ప్రస్తుతమున్న పరిస్థితిని విశ్లేషిస్తూ ప్రసంగాలు, ప్రచురణల ఆవిష్కరణలు ఉంటాయి.




