Wednesday, 4 November 2026

28న చలో విజయవాడకు పిలుపు

విజయవాడ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్యధోరణికి నిరసనగా ఈ నెల 28న చలో విజయవాడను జయప్రదం చేయాలని రాష్ట్ర పంచాయతీ కార్మిక సంఘం శనివారం పిలుపునిచ్చింది. తూర్పు కృష్ణాజిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ కార్మికులూ పాల్గొని తమ నిరసన తెలియజేసి, తమకు న్యాయంగా రావలసిన హక్కులు పొందేందుకు కార్యక్రమానికి రావాలని రాష్ట్ర పంచాయతీ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. కృష్ణా జిల్లా తూర్పుకమిటీ గ్రామపంచాయతీ కార్మిక సంఘం వారు మాట్లాడుతూ.. జీతాల పెంపు, పీఎఫ్‌, ఇఎస్‌ఐ ,పెన్షన్‌, ప్రభుత్వ కార్మికులుగా గుర్తింపు ఇవ్వాలనే తదితర అంశాలతో పోరాటం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోరాటంలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.