రెడ్డి సంఘం అధ్యక్షునిగా…. సంపతి మాధవరెడ్డి

బచ్చన్నపేట ( జనం సాక్షి) అక్టోబర్
బచ్చన్నపేట మండలం చిన్న రామ చర్ల గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షునిగా సంపతి మాధవరెడ్డిని రెడ్డి సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆదివారం చిన్న రామ చర్ల గ్రామంలో రెడ్డి సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా నిమ్మ నరేందర్ రెడ్డి. కార్యదర్శిగా పిన్నింటి కనుక సేన రెడ్డి. కార్యదర్శిగా వంగ నర్సిరెడ్డిని ఏకగ్రీవంగా చిన్నరామచర్ల రెడ్డి సంఘం సభ్యులందరికీ కలిసి ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలోని రెడ్డి సంఘం అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు.