మరిపెడ,ఏప్రిల్ 01:(జనం సాక్షి):డోర్నకల్ శాసనసభ్యులు డీ ఏస్ రెడ్యానాయక్ కృషి తో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి శరవెంగంగా జరుగుతున్నాయనిజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు, శనివారం పట్టణంలోని 5వ వార్డులో పలు సీసీ రోడ్ల పనులను,కాంట్రాక్టర్ నారెడ్డి చందు రెడ్డి కొత్తగా కొనుగోలు చేసిన సిమేంట్ మిక్చర్ యంత్రాన్ని అయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పది మంది చేసే పని ఒక యంత్రం చేస్తుందని, నూతన యంత్రాలతో అభివృద్ధి త్వరగా జరుగుతుందన్నారు. ప్రజలకు సౌకర్యాలను కల్పించేందుకు బిఆరెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన మరిపెడ పట్టణంలో,త్వరలో అన్ని వార్డుల్లో సిసిలు, డ్రైనేజీ పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. వర్ష కాలంలో పట్టణ వాసులకు బురద రహిత రోడ్లను అందుబాటులోకి తేవటమే ధ్యేయంగా ఎమ్మెల్యే అధికార యంత్రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో పట్టణ రూపురేఖలు మార్చి ఆహ్లాదభరితమైన, అన్ని వసతులతో కూడిన సుందరమైన మరిపెడ మున్సిపాలిటీగా, అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో, మున్సిపాలిటీ చైర్మన్ సింధూర రవి నాయక్, బిఆరెస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్ రెడ్డి, మరిపెడ మండల పార్టీ ఉపాధ్యక్షుడు నారెడ్డి సుదర్శన్ రెడ్డి,BRS పార్టీ నాయకులు, పానుగోతు వెంకన్న, రేఖ వెంకటేశ్వర్లు, షైక్ హుసైన్,,మచ్చర్ల భద్రయ్య, మాజీ ఎంపీటీసీ కెలోత్ వస్రం,పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు లతీఫ్,మూడవ వార్డ్ పార్టీ అధ్యక్షులు కొంచెర్ల రవి,సోషల్ మీడియా ఇంచార్జి గోల్కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు,
రెడ్యానాయక్ కృషితో పలు అభివృధి పనులు




