జుక్కల్ , మార్చి 30, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ రామ మందిరంలో శ్రీ రామనవమిపురస్కరించుకుని గురువారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటి అధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు.ఈ కార్య క్రమాన్ని కేశవ మహారాజ్ గోవింద్ మహా రాజ్ ప్రారంబించారు.ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతు రెడ్ క్రాస్ వారు అందిస్తున్న చల్లని తాగునీరు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు.ఈకార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఉమా కాంత్,సభ్యులు నరేష్ సేట్ సంతోష్ సేట్ గోరకనాథ్, హనుమంత్ కోటే తదితరులు పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ సొసైటి అధ్వర్యంలో తాగునీటి వసతి




