రెవెన్యూ సదస్సులకు సిద్ధంగా ఉండండి తాసిల్దార్ లకు సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష

 

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 09 : ఈనెల 15 నుండి ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులకు తాసిల్దార్ లు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తాసిల్దారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుండి జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులకు తాసిల్దార్లు అందరు రెవెన్యూ రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెవిన్యూ సదస్సులలో నాలుగు టీంలు పర్యవేక్షిస్తాయని, రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించి అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణి లో పరిష్కారం కానీ దరఖాస్తులు, ఈ నామ్, ముంపు భూములు తదితర వాటి రికార్డులను సిద్ధం చేయాలన్నారు. రైతులకు అణువుగా ఉండే ప్రాంతంలో సదస్సును నిర్వహించి రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, తాసిల్దార్ లు మదన్మోహన్, రాజు మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు