రేగోడ్( జనం సాక్షి )మే26 అక్రమ కలప రవాణా రేగోడు లో జోరుగా జరుగుతుంది వాల్టా చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులు చూసి చూడనట్లుగా వదిలివేయడంతో కలప రవాణా రేగోడు లో రోజురోజుకు పెరుగుతుంది చెట్లు ఉంటేనే వర్షాలు కురుస్తాయని ప్రాణవాయువు వస్తాయంటూ మొక్కలు నాటాలంటూ హరితహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రేగోడు లో చెట్లను యథేచ్ఛగా నరుకుతున్నారు గజవాడ చౌదర్పల్లి రేగోడు పెద్ద తాండా జగిర్యాల కొండాపూర్ మర్పల్లి ప్యారారం గ్రామాలలో అడ్డాలుగా చేసుకుని అక్రమ కలపను తరలిస్తున్నారు రేగోడ్ మీదుగానె రోజూ రెండు నుంచి మూడు లారీలు కలప రవాణా తరలిపోతుందని గ్రామస్తులు తెలిపారు నివారించే అధికారులే కలప రవాణాను అడ్డుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా చెట్లను నరకకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రేగోడు లో జోరుగా అక్రమ కలప రవాణా….




