జనంసాక్షి, కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామములో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతష్ఠాపన, బోనాలు కార్యక్రమంలో మంగళవారం రాత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని , ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డిఎంఎస్టి నిధులు రూ.ఐదు లక్షలు (5,00,000) మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండలాని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుని ఘనంగా శాలువాతో సత్కరించారు.
రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు




