కోటగిరి మార్చి 15 జనం సాక్షి:-తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి కి రానున్నట్లు ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణంలో మధ్యాహ్నం:-01-00గం.లకు ఏర్పాటు చేయనున్న సమావేశంలో ఉమ్మడి మండలంలోని 13 గ్రామాలకు చెందిన 2BHK లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు,సీనియర్ నాయకులు, లబ్ధిదారులు,తదితరులు పాల్గొనాలని ఆయన కోరారు.




