హైదరాబాద్ : మంగళవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సద్దుల బతుకమ్మ సందర్బంగా సెలవును ప్రకటించింది. కాగా… సద్దుల బతుకమ్మ సందర్బంగా హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్ వద్ద ఘనంగా ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 10 కోట్లతో అన్ని జిల్లాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తుండగా సద్దుల బతుకమ్మ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.




