రేపు మంథనిలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సన్మానం

 జనంసాక్షి, మంథని : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా మంథని నియోజకవర్గానికి సంబంధించిన స్వాతంత్ర్య సమరయోధుల అమరులైన కుటుంబాలకు, జాతి పౌరులకు, ప్రాణార్పణ చేసిన భద్రత సిబ్బంది కుటుంబాలను ఆగస్టు 12 శనివారం ఉదయం 11 గంటలకు మంథని గాంధీ చౌక్ వద్ద సత్కరిస్తూ వందన సమర్పణ చేయడం జరుగుతుందని బిజెపి పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి పోతన వేణి క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యులు బిజెపి నాయకులు ఎడ్ల సదాశివ్ కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి పాల్గొంటారని తెలిపారు.
కావున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని అమరవీరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు.

తాజావార్తలు