రేపు షూటింగ్ బాల్ జిల్లా స్థాయి సెలెక్షన్స్

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): ఈ నెల 20న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు షూటింగ్ బాల్ జిల్లా స్థాయి   క్రీడాకారుల ఎంపికలను నిర్వహించనున్నట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉబ్బని రత్నయ్య , ప్రధాన కార్యదర్శి దాసరి మైసయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ -19 కేటగిరీలో ఈ ఎంపికలు ఉంటాయన్నారు.ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2003 ఏప్రిల్ 1 తరవాత జన్మించి ఉండాలని, తమ వెంట ఎస్సెస్సీ మెమో   తీసుకురావాలని సూచించారు.మరిన్ని వివరాలకు సెల్ నంబర్స్ 9440570631 , 9908401200 లలో సంప్రదించాలన్నారు.