హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో రేపు 50 శాతం బస్సులను నడపనున్నట్లు ఎపి రావాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 12 వేల బస్సులో 4 వేల బస్సులు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసీ రూ. 1800 కోట్ల నష్టంలో ఉందని.. కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం వల్ల నెలకు రూ.956 కోట్ల భారం ఆర్టీసీ సంస్థపై పడుతుందన్నారు.




