హైదరాబాద్ సిటీ: తెల్ల కాగితం ఇస్తే చాలు ఆహార భద్రత కార్డులకు ఎంపిక చేసి, రేషన్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇందులో చాలా గందరగోళం చోటు చేసుకుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి పౌరసరఫరాల అధికారులు ఇప్పుడు ప్యూరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. కార్డులజారీ, పేర్లు తప్పులు, కుటుంబాల పేర్ల నమోదు, తొలగింపు, చిరునామాలను సవరించే కార్యక్రమం చేపట్టారు. పనిలో పనిగా లబ్ధిదారుల డుబ్లికేషన్ గుర్తించే ప్రక్రియను కూడా చేపట్టారు.వివరాలు సమగ్రంగా ఉంటేనే కార్డుల ప్రింటింగ్ ఇవ్వవచ్చని, ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
అచ్చుతప్పుల సవరణలు
లబ్ధిదారుల ఎంపికలో హడావుడి చోటు చేసుకోవడంతో చాలా మంది పేర్లు, పుట్టినతేదీలు, చిరునామాలు తప్పుగా నమోదు చేశారు. దరఖాస్తుదారుల నుంచి సరైన వివరాలు సేకరించి వీటినిపుపడు సవరిస్తున్నారు. చాలా కు టుంబాల్లో ఒకరి పేరుంటే మరొకరి పేరులేదు. కుటుంబ సభ్యుల వయస్సులో తప్పు ఉండడంతో చిన్న పిల్లలకు రేషన్ ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది తమ పేర్లు జాబితాలో లేవని సర్కిళ్ల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వీరి వివరాలూ సేకరించి పేర్లను, వయస్సును ఆధార్ కార్డు ఆధారంగా మార్పులు చేస్తున్నారు.
రేషన్ దుకాణాల మార్పులు చేర్పులు
కొంత మందికి ఏకంగా రేషన్ దుకాణాలే మారాయి. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నట్లు రేషన్ దుకాణాలను కేటాయించలేదు. తమ ఇంటికి సమీపంలో, కొద్ది దూరంలో ఉండే రేషన్ షాప్‌లకు కేటాయించాల్సిందిగా చాలా మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కేటాయింపులో హాడావుడి చోటు చేసుకోవడంతో లబ్ధిదారులకు చాలా దూరంలో ఉండే రేషన్ దుకాణాలను కేటాయించారు. ఇప్పుడు దగ్గర దుకాణాలనుకేటాయిస్తున్నారు.
పేరున్నా…కోటా రావడం లేదు
కొంత మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను కేటాయించినప్పటికీ వారి పేర్లు రేషన్ దుకాణాలకు చేర లేదు. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లితే మీకు కోటా రాలేదు, మేం ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. తమకు రేషన్ కోటా ఇవ్వడం లేదని సర్కిళ్ల కార్యాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుల మేరకు వారి పేర్లను ఆయా రేషన్‌దుకాణాలకు పంపిస్తున్నారు. కొంత మంది రెండు, మూడు చోట్ల కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి కొందరు రెండు కుటుంబాల్లో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. దీంతో కొన్ని చోట్ల ఎక్కువ మంది పేర్లు ఉండడంతో రెండు చోట్ల రేషన్ పొందుతున్నారు. ఇలాంటి పేర్లును గుర్తించి తొలగిస్తున్నారు. ఇలా 20వేలకు పైగా కార్డులను గుర్తించారు.