రేషన్ డీలర్ కుటుంబాన్ని పరామర్శించిన నర్ర రాజేందర్.
దౌల్తాబాద్ ఆగష్టు 18, జనం సాక్షి
దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామంలో ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం పొందిన రేషన్ డీలర్ ఎండీ యూసుఫ్ కుటుంబాన్ని పరామర్శించిన తెరాస యువజన మండల అధ్యక్షులు నర్ర రాజేందర్, తెరాస యువజన నాయకుడు నర్ర సత్యం అలాగే బాధిత కుటుంబానికి నాగేశ్వర రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షులు సళ్ళస్వామి , డాకేలా మల్లేశం, మండల కో ఆప్షన్ హైమద్,తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.