రేషన్ దుకాణం ఏర్పాటు పట్ల హర్షం..

ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా రేషన్ దుకాణం ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గుండ్లగుంటపల్లి, జంగాల కాలనీ, రెడ్యా తండా గ్రామాల ప్రజలు మూడు కిలోమీటర్ల మేర ఉన్న నర్సంపల్లి గ్రామపంచాయతీకి వెళ్లి రేషన్ సరుకులు తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడేవారు. బుధవారం గుండ్లగుంటపల్లిలో కొత్త రేషన్ షాప్ ప్రారంభించడంతో అందుకు సహకరించిన జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డికి, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మరియు ఎంపీపీ రాధజంగయ్య, జడ్పీటీసీ శాంతకుమారి రవీందర్, గ్రామ సర్పంచ్ మొండేళ్ల ఆంజనేయులుకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొండేళ్ల ఆంజనేయులు, ఎంపీటీసీ మోటపురం ఈశ్వరమ్మ, డిప్యూటీ సర్పంచ్ మంజుల శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు వెంకటయ్య, డీలర్ నర్సింహా, గ్రామస్తులు రమేష్, వెంకటయ్య, కొండల్, యాదయ్య, సంతోష్, బాలకిష్టయ్య, భాస్కర్, సాయికుమార్, రాములు, తదితరులు పాల్గొన్నారు.