రైతాంగం సౌభాగ్యం కోరే ఏకైక పార్టీ బిజెపి
మోత్కూరు సెప్టెంబర్ 29 జనంసాక్షి : రైతుల సంక్షేమమే బిజెపి ధ్యేయం రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అన్నారు. దేశంలోనే రైతుల సంక్షేమం కోసమే భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతాంగం సౌభాగ్యం కోరే ఏకైక పార్టీ బిజెపి నే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య అన్నారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సేవా సప్త కార్యక్రమంలో భాగంగా కిసాన్ సంనిధి లబ్ధిదారుల సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను పక్కదారి పట్టించిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్, దాసరి మల్లేశం,తుంగతుర్తి నియోజక వర్గం ఇంఛార్జి కడియం రామచంద్రయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు జిల్లా రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బొట్టు అబ్బయ్య,రైల్వే బోర్డు మెంబర్ కొంతం నాగార్జున రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్,గౌరు శ్రీనివాస్,మున్సిపల్ అధ్యక్షుడు బయ్యని రాజు,మండల అధ్యక్షుడు సోలిపురం లక్ష్మి నరసింహ రెడ్డి, సజ్జన మనోహర్ పోచం సోమయ్య,ముత్తినేని తిరుమలేష్, మామిడాల యాకేష్, బత్తుల యాదగిరి, టంగుటూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.