Thursday, 5 November 2026

రైతుబంధులో చిత్తశుద్ది లేదు: దాసోజు

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  రాష్ట్రంలోని రైతులకు మేలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ తప్పక స్వాగతిస్తుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోసు  శ్రవణ్‌ అన్నారు. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం పెద్ద డ్రామా అని ఆయన ఎద్దేవా చేశారు. సెక్యూరిటీ ఫీచర్స్‌ లేకుండా పాస్‌ పుస్తకాలు ప్రింటింగ్‌ చేస్తున్నారని, రైతుల పేరిట రూ.వందలకోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోడు భూములు సాగుచేసే రైతులకు పెట్టుబడి సాయం ఎందుకివ్వరని ప్రశ్నించారు. మిర్చి రైతులను కేసీఆర్‌ పట్టించుకోలేదని శ్రవణ్‌ విమర్శించారు. రైతులకు పూర్తి సాయం చేయడంలో ఎవరికీ అబ్యంతరం లేదన్నారు. అయితే ప్రభుత్వం తీరు చిత్తశుద్దిగా లేదన్నారు.