హైదరాబాద్,మే22(జనం సాక్షి ): రైతు బీమా పథక అమలు విధివిధానాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వివిధ శాఖల అధికారులతో చర్చించారు. రైతుబీమా పథకం అమలుతో పాటు రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పక్రియపై కూడా సీఎం సవిూక్షిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు మహముద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.




