రైతులకు క్రాపు లోన్లు మంజూరు చేయాలి
బ్యాంకు మేనేజర్ కు రైతు సంఘం వినతి
(జనంసాక్షి) జులై: రైతులకు క్రాపు లోన్లు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని ఏపీజీవీబీ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించి అనంతరం బ్యాంకు మేనేజర్ కు మేమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ క్రాప్ లోన్లు మంజూరు చేయాలని, రుణ ప్రణాళికను విడుదల చేయాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా వడ్ల డబ్బులను రైతుబంధు, మోడీ డబ్బులు ఏ ఇతర పైసలైన మొండి బాకీ క్రింద జమ చేయకూడదని, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లు బుక్కు అడ్జస్ట్మెంట్ విధానాన్ని ఆపాలని, లక్ష రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలి లేనిపక్షంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొనుగంటి శ్రీనివాస్ రెడ్డి, గర్నపల్లి చంద్రం, పిట్టల శ్రీనివాస్, కత్తుల నరసింహారెడ్డి, జింకల బాలమల్లు, ఆరుట్ల లింగం, పోలోజు నరసింహ చారి రైతులు పాల్గొన్నారు.