అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సూచించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
వ్యవసాయంలో అనుభవం ఉన్న రైతులతో సమావేశమై వారి అనుభవాలను తెలుసుకోవడమే కాకుండా వ్యవసాయంలో ఎదురవుతున్న సాధక బాధకాలను విశ్లేషించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సూచించారు.
ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం జగిత్యాల పొలాస కాలేజీ విద్యార్థులకు క్షేత్ర స్థాయి అనుభవం కోసం ఒక్కో విద్యార్థికి ఒక్కో రైతుకు అటాచ్ చేశారు.
అందులో భాగంగానే సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఆ విద్యార్థులు శుక్రవారం ఫీల్డ్ వర్క్ కు వచ్చారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఫీల్డ్ లెవెల్ లో అనుసరించాల్సిన విధానాన్ని, వ్యవసాయంలో రైతుల అనుభవాలను తెలుసుకోవడమే కాకుండా ఎదురవుతున్న కష్ట నష్టాలపై పరిష్కార మార్గాలను కనుగొనాలని వినోద్ కుమార్ ఆ విద్యార్థులకు సూచించారు.
కాలానుగుణంగా రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేయాలని వినోద్ కుమార్ సూచించారు.
అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు భవాని, అఖిల, నిహారిక, లయ, దీప్తి, మైనా, భవాని ప్రియా తదితరులు వినోద్ కుమార్ తో సమావేశమైన వారిలో ఉన్నారు.




