*రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
*కోడెల సమ్మయ్య.
చిట్యాల 14(జనం సాక్షి) గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో పత్తి చేలు, పొలాలు జాలు పట్టి ఎర్రగామారాయని, రైతుల పంటలకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ కిసాన్ సాంగ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోడెల సమ్మయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయాధికారులు రైతుల పంట పొలాలను సందర్శించి రైతులకు పలు సలహాలు, సూచనలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కృషి చేయాలని కోరారు