హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని టిడిపి నేత రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… రైతుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రతి ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపినందుకు మమ్మల్ని మార్షల్స్ తో బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మామా అలుళ్లు తప్ప ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన అవసరం లేదని తమ నిరంకుశ వైఖరిని ప్రభుత్వం ప్రకటిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా జెండాలు వేరు… రైతుల పట్ల మేమంతా ఒకటే అని స్పష్టం చేశారు. సీఎం తీరును ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.




