Tuesday, 3 November 2026

ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది :లక్ష్మణ్

హైదరాబాద్ : తెలంగాణ సమాజంలో ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని బిజెపి నేత లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..సమస్యలకు పరిష్కారానికి మార్గం లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. కనీసం ప్రభుత్వం ఎన్నికల హామీలనైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశాం. రైతులకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను చేనేత కార్మికులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశాం. అసెంబ్లీలో ఏక కాలంలో రైతు రుణ మాఫీ చేయమంటే మా గొంతు నొక్కారాని ఆ విధానాన్ని తప్పుపడుతున్నట్లు తెలిపారు. విపక్షాలు అన్నీ కలిసి రైతు రుణమాఫీ చేయాలన్న ఒక్క డిమాండ్ ను స్పీకర్ తోసిపుచ్చారని మండి పడ్డారు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యల పై ఎంఐఎం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని లక్ష్మణ్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *