Thursday, 5 November 2026

రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి పట్టాభూమి ఉన్న రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్‌ శివప్ప పటేల్‌ సూచించారు. సాలైరు సొసైటీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టాభూమి ఉన్న రైతులు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సభ్యత్వ రుసుం రూ. 300 చెల్లించి సభ్యత్వం పొందాలన్నారు. రైతులందరికీ ఎరువులు సక్రమంగా అందించాలని డైరెక్టర్‌లు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు సైదుల్‌రెడ్డి, డైరెక్టర్లు వెంకట్‌, గంగారాం, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *