Tuesday, 3 November 2026

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

హైదరాబాద్‌రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, చింతల, ప్రభాకర్‌లు చెప్పారు. వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రంగా వెళ్లారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించలేక పోతుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాలని వారు సూచించారు. గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులు అర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ప్లకార్డులు, గడ్డిని తీసుకువెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్గుకోవడంతో పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *