Tuesday, 3 November 2026

రైతుల సమస్యలపై పోరాడుతాం

హైదరాబాద్‌,:తమను అవమానించినా, కొట్టినా సహనంతో సభలోనే ఉండి రైతుల సమస్యలపై పోరాడుతామని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. రైతుల ఆత్మహత్యలే ప్రధాన అంశంగా తాము అసెంబ్లీలో తీసుకుంటామన్నారు. అసెంబ్లీని కనీసం 15 రోజులు నడపాలని ఆయన డిమాండ్‌ చేశారు.
అంతకుముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నివారించాలని  డిమాండ్ చేస్తూ టీటీీడీపీ ఎమ్మేల్యేలు గన్‌పార్క్ వద్ద ఆందోళన చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళు లర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీకి వెళ్లారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *