రైతుల సంక్షేమం కోసమే పిఎసిఎస్ గోదాం నిర్మాణం..
పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 26 (జనంసాక్షి):
రైతుల సంక్షేమం కోసమే ఊరుకొండ మండల కేంద్రంలో పిఎసిఎస్ గోదాము నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని రాచాలపల్లి గేట్ సమీపంలో గల సర్వేనెంబర్ 221/E/1/1/1 లో 1985 సంవత్సరంలో అప్పటి పిఎసిఎస్ ఉన్నతాధికారులు రైతుల సంక్షేమం కోసం కొనుగోలు చేసిన 10 గుంటల భూమిలో ప్రభుత్వం నుండి మంజూరైన కోటి రూపాయలు విలువ చేసే పిఎసిఎస్ గోదాం నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు బోరు డ్రిల్లింగ్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొమ్ము రాజయ్య, ఎంపిటిసి కలిమిచర్ల గోపాల్, పిఎసిఎస్ డైరెక్టర్లు వెంకటయ్య, ఫరీద్, ఉప సర్పంచ్ లు నారాయణ, పరశురాములు, మాజీ సర్పంచ్ మేకల శ్రీనివాసులు. సీనియర్ నాయకులు సుజీవన్ రెడ్డి, గిరి నాయక్, బక్క జంగయ్య, బచ్చలకూర రమేష్, కొమ్ము శ్రీను, అమరేశ్వర్ రెడ్డి, గోపి, మల్లేష్, సందీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.