హైదరాబాద్, రైతు ఆత్మహత్యలకు పరిష్కారం లభించే వరకు అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి అన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రశ్నిస్తే అధికార ప్రభుత్వం మాపై తప్పుడు కేసులు పెడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తాం కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి కోరారు.




