Tuesday, 3 November 2026

రైతు కట్టిన కేబుల్ బ్రిడ్జి…రైతు కట్టిన కేబుల్ బ్రిడ్జి.

..

 

 

 

 

 

 

 

– అబ్బురపరిచే విధంగా నిర్మాణం …!భైంసా రూరల్   ఫిబ్రవరి 01 జనం సాక్షి భైంసా మండలానికి చెందిన ఓ రైతు తనలో ఉన్న సృజనాత్మకత ఆలోచనలు వెన్నుతట్టి సుద్ధవాగు నీటిని దాటి 800 ఎకరాలకు వెళ్లే విధంగా వెదురు బద్దలు, కట్టెలు,బల్లలతో కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.వివరాల్లోకి వెళ్తే…భైంసామండలం కత్ గాం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో ఉన్న సుద్ధవాగు దాటి పంటపొలాలకు వెళ్లే క్రమంలో ఇబ్బంది ఎదురవుతుంది.గతంలో వాగుదాటేక్రమంలో రైతు మరణించిన సంఘటనకూడా వుంది.నిత్యం నీరువుండే వాగు పై పరిష్కార మార్గం,పంట పొలాలకు వెళ్ళే విధంగా గ్రామానికి చెందినదేగ్లూర్ నాగేష్ తన సొంత ఖర్చులతో రైతులకు కేబుల్ బ్రిడ్జి వేశారు.ఇదిచూసిన రైతులు,పలువురు అతనిని ప్రశంసిస్తూన్నారు.