… సర్పంచ్ బానోతు రూప్ల నాయక్
స్టేషన్ ఘన్పూర్, జూలై ,( జనం సాక్షి) : కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టాదా రు పాస్ పుస్తకం వచ్చిన రైతులు,ఇంతకుముందు రైతు బీమా చేసుకొనివారికి రైతు బీమా చేసుకోవ డానికి అవకాశం ఉందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఫతేపూర్ సర్పంచ్ బానోతు రూప్ల నాయక్ అన్నారు.చిల్పూర్ మండ లంలోని ఫతేపూర్ గ్రామంలో ఆయన మాట్లాడు తూ రైతు బీమా చేయించుకునే రైతులు జూన్ 22 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలని, రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని అన్నారు. ఆధార్ కార్డు ప్రకారమే వయసు ప్రామాణికం ఉంటుందని,ఎన్ని గ్రామాల్లో భూమి ఉన్న ఒక గ్రామంలోనే రైతుబంధు వర్తిస్తుం దని,రైతు మరణిస్తే లక్షల ప్రమాద భీమా వస్తుంద ని రైతులు రైతు బీమా చేయించుకొనిఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




