Wednesday, 4 November 2026

రైతు ల సమస్యల పట్ల కలెక్టరేట్ ముట్టడికి తరలిరండి

రైతు ల సమస్యల పట్ల కలెక్టరేట్ ముట్టడికి తరలిరండి

రుద్రంగి డిసెంబర్ 4 (జనం సాక్షి)
రుద్దంగి మండలం మానాల గ్రామంలో ఆదివారం వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
పోడు బూములకు పట్టాలు ఇవ్వాలని,ఎక కాలము లో లక్ష రూపాయలు రుణ మాఫీ చెయ్యాలని,వడ్లు కొను గోలు కేంద్రము లో జాప్యం,ధరణి వెబ్సైట్ రద్దు చేయాలని సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని మండల రైతులందరూ విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ పీసీసీ ప్రెసిడెంట్ వి హనుమంతరావు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు
ఓబిసి స్టేట్ కన్వీ నర్ వంశీ,జక్కు మోహన్, చెలుకల తిరుపతి,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తూము జలపతి,సామ మోహన్ రెడ్డి, పల్లి గంగాధర్,గండి నారాయణ,లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు