Wednesday, 4 November 2026

రైతు సంక్షేమం దేశానికి ఆదర్శం: ఎంపి బూర

హైదరాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): రైతే రాజు మా నినాదం కాదని, అది మా విధానం అని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణ పథకాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా, అమలుకు నోచే కార్యక్రమాఉలగా ఆకర్శిస్తున్నాయని అన్నారు. ఒక ఎంపీగా.. డాక్టర్‌గా చెబుతున్నా.. రైతు బీమాతో ధీమా కల్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు బీమాను దేశ వ్యాప్తంగా రైతులంతా స్వాగతిస్తున్నారని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన రైతులకు ఏ ఉద్యోగాల్లోలైనా 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రైవేటు మెంబర్‌ బిల్లు పొందిపరిచామన్నారు. ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు లోక్‌సభ నుంచి లేఖ వచ్చిందన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగితే పేద రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని ఎంపీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలు తక్కువగా ఉన్నారని చెప్పారు. బలహీన వర్గాల వారికి మద్దతుగా నిలిచేలా తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సుప్రీం తీర్పుతో ఇకపై ఎస్సీ, ఎస్టీలకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.