Tuesday, 3 November 2026

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

నల్గొండ : నల్గొండ జిల్లా దామరచర్లలో ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కృష్ణంరాజు, మల్లేశ్వరిగా గుర్తించారు. దామరచర్లకు చెందిన కృష్ణంరాజు, మల్లేశ్వరి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం పెద్దలు త్రిపురం మండలం పెద్ద దేవులపల్లికి చెందిన ఓ యువతితో కృష్ణం రాజుకు వివాహం జరిపించారు. పెళ్లి ఇష్టం లేని కృష్ణం రాజు నాలుగు రోజుల క్రితం మల్లేశ్వరితో కలిసి అదృశ్యమయ్యారు. మొదటి భార్య తరపు బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఇద్దరూ దామచర్ల వద్ద పుష్‌పుల్‌ రైలు కిందపడి అత్మహత్యకు పాల్పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *