రామలక్ష్మణ కూడలి(శీకాకుళం): సింగ్‌పురం వద్ద జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. హైవే సిబ్బంది, 108సిబ్బంది, స్థానికులు రెండుగంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన లారీ ఛత్తీస్‌గఢ్‌లోని జిందాల్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.




