కాచిగూడలో ఫిర్యాదు చేసిన బాధితురాలు
28తులాల నగదు,లక్ష నగదు మాయమైనట్లు ఆరోపణ
హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): బెంగళూర్‌ాకాచిగూడ యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. ఇందులో భారీగా బంగారు నగలు, నగదును దొంగలు దోచుకున్నారు. ఈ రైళ్లో ప్రయాణిస్తున్న మహిళ సూట్‌కేసులో ఉన్న 28 తులాల బంగారు అభరణాలు, రూ.లక్ష రూపాయల నగదు మాయమైన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఇన్‌స్పెక్టర్ డి.విజయ్‌లాల్ తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి శ్రీ సాయి రెసిడెన్సీ ప్లాట్ నెంబర్‌ా404లో నివసిస్తున్న నాగేశ్వరప్రసాద్ సతీమణి ఎ.నగరత్న ప్రతిభ(35) ఏప్రిల్ 30న కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల వివాహనికి వెళ్లారు. అక్కడి నుంచి మే 9న బెంగళూర్‌లో ఉండే నగరత్న ప్రతిభ అమ్మ ఇంటికి వెళ్లారు. తిరిగి నగరానికి రావడానికి ఈ నెల 6వ తేదీన బెంగళూర్ రైల్వేస్టేషన్‌లో యశ్వంత్‌పూర్‌ాకాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైల్లోని బోగి నెంబర్ బీ2 లోని 10, 11 సీట్లల్లో కుటుంబ సభ్యులు కుర్చోని.. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉదయం వచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి బాచుపల్లిలోని ఇంటికి వెళ్లిపోయారు. సూట్‌కేసు తెరిచి చూసే సరికి అందులో ఉన్న 28 తులాల బంగారు అభరణాలు, రూ.లక్ష నగదు కన్పించలేదు. నగరత్న ప్రతిభ కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు బదిలీ చేసినట్లు రైల్వే ఎస్సై పి.సంగమేశ్వర్ తెలిపారు.




