రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య

వరంగల్‌: కాజీపేట వద్ద రైల్వేట్రాక్‌పై ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బీటెక్‌ విద్యార్థులు కుషాల్‌కుమార్‌, వినోదినిగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సహచరులు తెలిపారు.