రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు7
నేరేడ్ మెట్ లోని వాజ్ పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ దీక్ష చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ. వాజ్ పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కొరకు 7 సంవత్సరాల క్రితం శిలాఫలకం వేశారని నేటికీ పనులు మొదలు పెట్టకపోవడంతో రైల్వే గేటు పడితే ఇటు కిలోమీటర్ మరియు అటు కిలోమీటర్ దూరం వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుందని దీంతో విద్యార్థులు,ఉద్యోగులు,ఎమర్జెన్సీ వాహనాలు ట్రాఫిక్ లో నిలిచిపోయి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు.
రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వెంటనే మొదలు పెట్టాలని సంతకాల సేకరణ చేపట్టామన్నారు.సంబంధిత అధికారులు వెంటనే పనులు చేపట్టాలని లేనిచో బిజెపి ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్,విఠోబా,రమేష్ గౌడ్,నవీన్, గణేష్,శ్రీకాంత్,లక్ష్మణ్ గౌడ్,వెంకటకిషోర్,రాంబాబు,వెంకట్ యాదవ్,సంతోష్, గోపురమణారెడ్డి,ఉమామహేశ్వరి,సుశీల,పర్వతాలు స్థానికులు పాల్గొన్నారు.

తాజావార్తలు