Tuesday, 3 November 2026

రైళ్ల రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌: నీలం తుపాను  ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ఈ సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌ నుంచి ఆలస్యంగా రైళ్లను నడుపుతోంది, సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ 6.45 గంటలకు, సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 7.45గంటలకు బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్‌-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8 గంటలకు, సికింద్రాబాద్‌-విశాఖపట్నం గరీభ్‌రథ్‌ 9.45 గంటలకు బయలు దేరనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *