Wednesday, 4 November 2026

రోగిపై వార్డుబాయ్‌ అత్యాచారం

ఉస్మానియాలో దారుణం
హైదరాబాద్‌,మే5(జ‌నం సాక్షి):  ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి.. సేవలందించాల్సిన వార్డ్‌ బాయ్‌ ఓ రోగిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న రోగిపై వార్డ్‌ బాయ్‌ నాగరాజు అత్యాచారం చేశాడు. విధుల్లో ఉన్న ¬ంగార్డు ఖమర్‌.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. మొత్తానికి బాధితురాలి ఫిర్యాదుతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్‌ పోలీసులు.. వార్డ్‌బాయ్‌ నాగరాజు, ¬ంగార్డు ఖమర్‌ను అదుపులోకి తీసుకున్నారు.