రోగులతో దురుసుగా వ్యవహరిస్తున్న ఫార్మసిస్ట్ పై చర్యలు తీసుకోవాలి
దంతాలపల్లి ఆగస్టు10 జనంసాక్షి
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న సోమ్లా విధుల్లో అలసత్వం వహిస్తున్నాడని ఎస్సీ జన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంతం విజయేందర్, జై భారత్ ఎస్సి పోరాట వేదిక జిల్లా అధ్యక్షులు వెలిశాల శ్యామ్ లు మండల వైద్యాధికారి వేదకిరణ్ కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోగుల పట్ల ఫార్మసిస్ట్ దురుసుగా ప్రవర్తిస్తూ మందులు ఇవ్వకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగులను చిన్నచూపు చూస్తూ కించపరుస్తున్న సదరు ఫార్మసిస్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని డిప్యూటీ డి యం హెచ్ ఓ మురళీధర్ కు ఫోన్ ద్వారా పిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్మసిస్ట్ పై చర్యలు తీసుకొని పక్షంలో తమ సంఘాల ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.