రోడ్డు ప్రమాదంలో పీజీ విద్యార్థి మృతి
దౌల్తాబాద్ సెప్టెంబర్ 11, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి గ్రామానికి చెందిన బహుజన సమాజ్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల నరసింహులు కుమారుడు శనివారం వరంగల్లో మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు హైదరాబాదులోని ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న ముత్యాల గౌతమ బుద్ధుడు శనివారం వరంగల్ లో తన స్నేహితుడింటికి బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.వరంగల్ టౌన్ ఇంతేజర్ గంజి పోలీస్ స్టేషన్లో తండ్రి ముత్యాల నరసింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని జరిగిన సంఘటనపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.