రోడ్డు బాధిత కుటుంబాలకు విశ్రాంత ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘం బియ్యం పంపిణీ
మునగాల, డిసెంబర్ 10(జనంసాక్షి): గత నెల 12న మునగాల మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తీవ్ర గాయాల గురైన కుటుంబాలకు విశ్రాంతి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం 7 క్వింటాల 50 కేజీల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్ చేతుల మీదుగా బాధిత కుటుంబాల సభ్యులకు పంపిణీ చేశారు. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 20 మంది పైగా గాయాల గురి కావడం చాలా బాధాకరమని విశ్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు శాఖమూడి అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు ప్రతాప్ రెడ్డి, కొప్పుల వెంకట నరసింహారెడ్డి, జెట్టి రామిరెడ్డి, ఓరుగంటి రవి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకున్న వారందరికీ ధన్యవాదములు
గత నెల 12న 65వ నెంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన గాయాల గురైన కుటుంబాలను గుర్తించి పలు కుల సంఘాలు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు శాసనసభ సభ్యులు పూర్వ విద్యార్థులు వ్యక్తిగత అనుబంధంతో బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న వారందరికీ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్ తెలిపారు.




