Thursday, 5 November 2026

రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం

ఓట్ల కోసం వస్తారు రోడ్లు అడిగితే పట్టించుకోరా…?

మల్హర్ జనంసాక్షి

మల్హర్ మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలోని బిసి కాలని 4వ వార్డ్ 5 వ వార్డ్ రోడ్డు పరిస్థితి ఆ కాలని వాసులకి అద్వనంగా మారిందని.మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు లేక అవస్థలు పడుతున్నారని.తెలంగాణ ప్రభుత్వం వస్తే రోడ్లు నీళ్ల నియామకాలు ఎన్నో వస్తాయని ఆశ తో ఓట్లు వేసి నాయకులను గెలిపించుకున్నామని.కానీ ఓట్ల సమయం లో ఇచ్చిన హామీలు మాత్రం తుంగలో తొక్కి కాలక్షేపం చేస్తున్నారని రోడ్లు కావాలని అడిగితే అసలు పట్టించుకోకుండా నిద్ర వ్యవస్థలో వ్యవహరిస్తున్నారని బిసి కాలనిలోని 4వ వార్డ్ 5వ వార్డ్ ప్రజలు నాయకులపై అధికారులపై మండిపడుతున్నారు.మట్టి రోడ్డు పై నీళ్లతో బురద వచ్చి బురదలో పందులు తిరుగుతూ దోమలతో అనారోగ్యంతో విష జ్వరాలు బారిన పడుతున్నామని.తాడిచెర్ల గ్రామంలోని బిసి కాలనిలోని 4 వ వార్డ్,5వ వార్డ్,లో కనీసం రోడ్డు.పై నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉందని బురదలో నడుస్తూ అవస్థలు పడుతున్నామని. పాలకులకు అధికారులకు ఆ కాలని వాసులు ఎన్ని సార్లు విన్నవించినా కూడా పట్టించుకోకుండా నిద్ర వ్యవస్థలో కాలం గడుపుతున్నారని మండిపడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి బిసి కాలనీ కి రోడ్డు వేయాలని బిసి కాలనీ ప్రజలు అధికారులను పాలకులను వేడుకుంటున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం

అనుముల రాజయ్య

గత కొన్ని సంవత్సరాలుగా మా విధి కి రోడ్డు లేక చాల అవస్థలు పడుతున్నాం.అధికారులకు నాయకులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా మా విధి కి రోడ్డు వేయాలని అధికారులను కోరుకుంటున్నను.

దోమలతో పందులతో విష జ్వరాలు వస్తున్నాయి

ముద్రవేని లింగన్న

మా వార్డ్ కి రోడ్డు వెపించి నాలలు కంటించండి రోడ్డు లేక చాల అవస్థలు పడుతున్నాం.ఉన్న రోడ్డు పై బురద ఉండడంతో పందులు దోమలతో రోగాల బారిన పడుతున్నాం మా వార్డ్ కి రోడ్డు వెపించండి.