కార్యాలయం ముందు స్థానికుల నిరసన
* రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 22 :- రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ తో పాటు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పరిష్కారం కోసం కృషి చేయడం లేదని స్థానికులు ధ్వజమెత్తారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుక్కమ్మకుంట ప్రాంతానికి చెందిన పెద్ద మసీద్ బస్తి వాసులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి నివాసితులై ఉంటూ రోడ్డు సమస్యతో సతమతం అవుతున్నామని గతంలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించి కుట్రపూరితంగా దారి మళ్లించి మాకు అన్యాయం చేశారని ఆరోపించారు నేడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా రూపుదిద్దుకున్నప్పటికీ మజీద్ గల్లి రోడ్డు అభివృద్ధికి నోచుకో పోవడానికి గల కారణాలు ఏమిటని నిలదీశారు కొంతకాలం క్రితం ఏర్పడ్డ నూతన కాలనీలో భూగర్భ డ్రైనేజీలు సిసి రోడ్లు వేస్తూ అభివృద్ధి చేస్తున్నామని డప్పు కొట్టుకునే ప్రజా ప్రతినిధులకు 30 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ బస్తీలో సిసి రోడ్డు నిర్మాణం చేయాలనే సోయి కూడా లేకపోవడం ఎంతో దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జ్యోతి స్పందిస్తూ త్వరలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో మజీద్ గల్లి సిసి రోడ్డు నిర్మాణం కోసం తప్పనిసరి నిధులు కేటాయించే విధంగా తీర్మానం చేసి సి సి రోడ్డు నిర్మాణం చేయించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్థానికులకు భరోసానివ్వడం జరిగింది




