రోడ్ విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

– సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేసే లోపు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకమైన పనులు చేపట్టిన రోడ్ల కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, ఎలుగూరి గోవింద్ , మేకనబోయిన సైదమ్మ , సిపిఎం టూ టౌన్ కార్యదర్శి బత్తుల వెంకన్న , పట్టణ నాయకులు మామిడి సుందరయ్య , వల్లపుదాసు సాయికుమార్, కొండేటి ఉపేందర్, అర్వపల్లి లింగయ్య , పందిరి సత్యనారాయణరెడ్డి , వీరారెడ్డి, కేశవరెడ్డి , భాగ్యమ్మ , భిక్షమమ్మ తదితరులు పాల్గొన్నారు.